Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వరద బాధిత వాహన దారులకు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ భోజనాలు

వరద బాధిత వాహన దారులకు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ భోజనాలు

0

వరద బాధిత వాహన దారులకు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ భోజనాలు

న్యూస్ తెలుగు/చింతూరు : గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణ ప్రభావంతో ఏజెన్సీ మండలాల్లో తో సహా సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా ఛత్తీస్గడ్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లతో భారీ వర్షాలు కురవడంతో జాతీయ రహదారులపై వరద నీరు చేరి రహదారులు మూసుకుపోయాయి. చింతూరు మీదుగా ఒరిస్సా కు వెళ్లే జా తీయ రహదారి కుయుగూరు వద్ద వరద నీటితో ముంపుకు గురికావడంతో భారీ సంఖ్యలో వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా రోడ్లపై నిలిచిపోవడంతో చట్టిజాతీయ రహదారి 30 వద్ద వందల సంఖ్యలో లారీలు నిలిచిపోవడంతో డ్రైవర్లు ఆహారం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు లారీ డ్రైవర్లను గమనించి జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ తెలుగుదేశం మండల అధ్యక్షులు ఎండి జమాల్ ఖాన్ వెంటనే తన సిబ్బందితో భోజనాలను వండించి ఆటోలో ఒరిస్సా రహదారిపై ఉన్న లారీ డ్రైవర్లకు అలాగే చట్టి జాతీయ రహదారిపై నిలిచిపోయిన లారీ డ్రైవర్లు అందరికీ ఉచితంగా భోజనాలు ట్రస్ట్ ద్వారా అందజేసి ఆకలిని తీర్చినారు. ఆయుర్వేద వైద్యం తో పాటుగా అన్నదాతగా ప్రజల్లో జమాల్ ఖాన్ నిలిచినారు. ప్రతి ఏటా జరిగే వరదల సమయంలో జాతీయ రహదారులపై చిక్కుకున్న లారీ డ్రైవర్లకు భోజనాలు వండించి స్వయంగా సిబ్బంది చేత అందజేయడం జరుగుతుంది. లారీ డ్రైవర్లు జమాల్ ఖాన్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెకేసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు పసుపులేటి సాల్మన్ రాజు, సభ్యులు అబ్రార్ ఖాన్, రియాజ్, అజీజ్, ఎస్కే సమీర్, యాకుబ్ పాషా, పాల్గొన్నారు.(Story : వరద బాధిత వాహన దారులకు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ భోజనాలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version