33 స్నాక్స్ షాప్ ప్రారంభించిన జీవి
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక సురేష్ హాల్ రోడ్డులో 33 స్నాక్స్ షాప్ నూతన ప్రారంభోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. వ్యాపార రంగంలో యువత అడుగుపెట్టడం అభినందనీయమని, 33 స్నాక్స్ నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story:33 స్నాక్స్ షాప్ ప్రారంభించిన జీవి)

