పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం
న్యూస్‌తెలుగు/ ఒంగోలు : కొత్తపట్నం మండల సమాఖ్య కార్యాలయం నందు గ్రామ సమాఖ్య అధ్యక్షులకు పోషకాహారము దాని ప్రాముఖ్యత అనే అంశం పట్ల విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ మరియు జిల్లా విద్యాశాఖ సమన్వయంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం ఏపీఎం కే విజయ కుమారి గారి అధ్యక్షతన జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారిని శ్రీమతి టి పద్మావతి గారు హాజరయ్యారు. దేశంలో మహిళలు 80 శాతం మంది తగిన పోషకాహారము లేక అనారోగ్యాలకు గురవుతున్నారని దీనిని అధిగమించడానికి సమతుల్య ఆహారం అవసరమని మండల విద్యాధికారిని అన్నారు. ప్రాథమిక స్థాయి నుండి చిన్నారులకు విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వము పీఎం పోశాన్ ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నది. ప్రతిరోజు విద్యార్థులకు సమతుల్య ఆహారం అందించడంలో భాగంగా మెరుగైన ఆహారాన్ని పోషక విలువలతో కూడిన సూక్ష్మ స్థూల పోషకాలను విద్యార్థులకు ఆహారంలో అందిస్తున్నాము. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఇచ్చే ఆహార పదార్థాలలో బలవర్ధకమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా ఐరన్ పోలిక్ యాసిడ్ బి కాంప్లెక్స్ ఏ మరియు డి విటమిన్లు వంటివి మరియు ఫైబర్లు కార్బోహైడ్రేట్స్ కోడిగుడ్డు ప్రతిదినము ఇస్తున్నాము అని తెలియజేశారు. విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి టి రంగారావు మాట్లాడుతూ మహిళలు అనారోగ్య సమస్యలను అధిగమించడానికి మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కలిగి ఉండి రోజువారి వస్తున్నటువంటి సీజనల్ వ్యాధులనుండి తగిన రక్షణ పొందాలని విన్నవించారు. ఈ సందర్భంగా హాజరైనటువంటి గ్రామ సమైక్య లీడర్లకు వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా భోజనానికి ముందు మల మూత్ర విసర్జన అనంతరం చేతులు కడుక్కునే విధానాలను ఏడు రకాల మార్గాలను తెలియజేశారు. భవిష్యత్తు భారతం ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండాలంటే ఇప్పటినుండే పిల్లలకు ఆరోగ్యకరమైన అంశాల పట్ల అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కె విజయలక్ష్మి ఏపీఎంఓ గారు మాట్లాడుతూ ఇక్కడ తెలుసుకున్న విషయాలని గ్రామాలలో మీ సంఘాలలోని గ్రూపులతో చర్చించాలని ఈ విషయాలన్నిటినీ మన గ్రూపు సభ్యుల ద్వారా ప్రజలందరికీ చేరే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఎంఈఓ గారు విజయవహిని చారిటబుల్ ఫౌండేషన్ వారిచే ముద్రింపుబడిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీసీలు రామారావు గారు ఝాన్సీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. (Story:పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం)

