సతీష్ యాదవ్ కు గిడుగు రామ్మూర్తి అవార్డు
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలుగు కళా రత్నాలు సంస్కృతిక సేవా సంస్థ వారు పిలుపుమేరకు ముఖ్య అతిథిగా విజయవాడ వెళ్ళిన సతీష్ యాదవ్ గారికి గిడుగు రామ్మూర్తి అవార్డు ప్రధానం చేసిన నిర్వాహకులు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి వెళ్లిన సతీష్ యాదవ్ కు నిర్వాహకులు ఘనంగా ఆహ్వానించి అంతకుముందే ప్రకటించిన గిడుగు రామ్మూర్తి గారి అవార్డును ఆ సంస్థ సీఈఓ డాక్టర్ యు వి రత్నం డాక్టర్ మురళీ కృష్ణ , డాక్టర్ ధనాసి ఉషారాణి తదితర నిర్వాహకులు అందించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలంగాణ నుండి ముఖ్యఅతిథిగా పిలిచామని, కానీ వారి ప్రయాణంలో ఆలస్యం అయినందున , సతీష్ యాదవ్ గారు సకాలంలో రాకున్నా వారికి సేవారంగంలో ప్రకటించిన గిడుగు రామ్మూర్తి గారి అవార్డు అందించడం మా అదృష్టమని తెలిపారు. ఈ మధ్యనే సతీష్ యాదవ్ గారు డాక్టర్ అందుకోవడం వారికి మా సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. (Story:సతీష్ యాదవ్ కు గిడుగు రామ్మూర్తి అవార్డు)

