కుట్రలు, అడ్డంకులు దాటుకుని రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి
16,347 టీచర్ పోస్ట్‌లతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్: చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు /వినుకొండ : కుట్రలు, అడ్డంకులు దాటుకుని రికార్డ్ సమయంలో మెగా డీఎస్సీ నిర్వహణ, ఫలితాలు, మెరిట్ జాబితాల ప్రకటనతో మంత్రి లోకేష్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టు కున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫైల్ మీదనే తొలి సంతకం పెట్టగా, తదనంతర కసరత్తులు పూర్తి చేసి పగడ్బందీగా, పారదర్శకంగా భారీ డీఎస్సీని నిర్వహించడం, వారాల వ్యవధిలో ఫలితాలు ప్రకటించడం చారిత్రకం సందర్భమన్నారు. డీఎస్సీ పరీక్షల ద్వారా ఇలా ఒకేసారి మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ చేపట్టినట్లు అయిందన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ఇదొక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. “ఇది కేవలం ఉద్యోగాల భర్తీ కాదు, వేలాది కుటుంబాల భవిష్యత్తు నిర్మాణం” అని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంపై కడుపుమంటతో రగిలిపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్ డీఎస్సీకి వ్యతిరేకంగా 24కేసులు వేయించినా అన్నీ అధిగమించి ప్రక్రియ పూర్తిచేసిన ఘనత పూర్తిగా మంత్రి లోకేష్‌కే చెందుతుందన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీతోపాటు కూటమి అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఆయన తీసుకునివచ్చిన సంస్కరణల ఫలితాలు క్షేత్రస్థాయి లో కనిపిస్తున్నాయని, ప్రభుత్వ విద్యాసంస్థలు ముందంజ వేస్తున్నాయని అన్నారు చీఫ్‌విప్ జీవీ . ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీలో నిరుద్యోగ వర్గాలకు మరింత తీపి కబురుచెప్పినం దుకు వ్యక్తిగత ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. రాష్ట్రంలో అత్యధిక డీఎస్సీలు నిర్వహించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభు త్వాలకే దక్కుతుందన్నారు. చంద్రబాబు మొత్తం 14ఏళ్ల ముఖ్యమంత్రి హయాంలో 13 డీఎస్సీ ల ద్వారా 1,80,208 టీచర్ పోస్టులు ఇచ్చారని, ఇప్పుడు పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో సగం ఆయన నియమించిన వారే కావడం మరో అరుదైన రికార్డ్‌గా తెలిపారు. తెలుగుదేశంపార్టీ గత ప్రభుత్వంలోనూ 2014-19 మధ్య రెండు డీఎస్సీల ద్వారా 18వేల టీచర్ పోస్టులు భర్తీ జరిగింద ని గుర్తు చేశారు. దీనికి పూర్తి విరుద్ధమైన రీతిలో పాలన సాగించిన జగన్ రెడ్డి అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు చీఫ్‌విప్ జీవీ. ఫలితంగానే అంతకు ముందు నాణ్యమైన విద్యంలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను 19 స్థానికి పడేసిన ఘనుడు జగన్ రెడ్డని ఎద్దేవా చేశారు. ప్రభుత్వబడులకి రంగులు మార్చడం తప్ప అతడు చేసింది శూన్యమన్న జీవీ పైగా టీచర్లపై కక్షగట్టి కేసులు పెట్టి వేధించి దుర్మార్గపు పాలనను 2019-24 మధ్య రాష్ట్రంలో చూశామన్నారు. మళ్లీ ఇంతకాలానికి కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ బడులకు టీచర్లు వస్తున్నారని, వారికి ప్రతినెలా 1వ తేదీనే జీతా లు అందుతున్నాయని ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. (Story:కుట్రలు, అడ్డంకులు దాటుకుని రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి)

