Home వార్తలు త్వరలో రిలీజ్ కు వస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ”  

త్వరలో రిలీజ్ కు వస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ”  

0

త్వరలో రిలీజ్ కు వస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ”  

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా :సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా తెరకెక్కుతోంది.  త్వరలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘నాలో నేను’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ కొత్త స్టైల్ ట్యూన్ తో  కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా..సంజిత్ హెగ్డే పాడారు. ‘నాలో నేను’ పాట ఎలా ఉందో చూస్తే – నాలో నేను, తనలో తాను, కలిసే ఉన్నాం విడిగా, కాలమా కాలమా ఈవేళని తెల్లవారినీకమ్మా, దూరమా దూరమా రెప్పపాటులో మాయమై పోమ్మా, ఇందాక చేరుకుంది ఇందుకేనా, ఇంతేనా కాలమంతా మౌనమేనా..అంటూ మెలొడియస్ గా సాగుతుందీ పాట.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్ (Story:త్వరలో రిలీజ్ కు వస్తున్న “కపుల్ ఫ్రెండ్లీ”  )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version