ఆలనా పాలనా లేని బస్టాండ్ ను శుభ్రపరచిన ఆటో యూనియన్ సభ్యులు

న్యూస్ తెలుగు/ చింతూరు :చింతూరులోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. బస్టాండ్ ఆవరణంలో చెత్త చెదారం తో నిండుకుంటుంది. మరుగుదొడ్లు ఉన్నా శుభ్రపరిచే నాధుడు లేక, నీటి సౌకర్యం లేక దుర్గంధం వెదజల్లుతున్నది . బస్టాండ్ లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పట్టపగలు తో పాటు, రాత్రుళ్లు బిచ్చగాళ్లకు నిలయమై పోయింది. బిచ్చగాడు మలమూత్రాలు బెంచీలపైనే విసర్జించటంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ బస్టాండ్ గోకవరం డిపో పరిధిలో ఉన్నప్పుడు, లైటింగ్, నీటి సౌకర్యం, పరిసరాలు పరిశుభ్రతగా చేయటానికి ఒక మనిషి ఉండేవారు. ఈ బస్టాండ్ ను పాడేరు డిపోపరిధిలోకి మార్చడంతో దీని ఆలనా పాలన చూసేవారు కరువయ్యారు . దీంతో విసుగెత్తిన ఆటో యూనియన్ సభ్యులు, సోమవారం బస్టాండ్ ఆవరణ మొత్తం శుభ్రంచేసి, చెత్తను దగ్ధం చేశారు. అలాగే మరుగుదొడ్లను శుభ్రం చేశారు. అంతేగాక సొంత ఖర్చులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆటో యూనియన్ ఈ విధంగా చేయడంతో చింతూరులోని పౌరులందరూ ఆటో యూనియన్ సభ్యులు బస్టాండ్ శుభ్రపరచినందుకు మెచ్చుకుని, వారు చేసిన సేవలను కొనియాడారు. (Story:ఆలనా పాలనా లేని బస్టాండ్ ను శుభ్రపరచిన ఆటో యూనియన్ సభ్యులు)

