ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000వేలు ఇవ్వాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటియు) ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వనపర్తి మర్రికుంట నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎన్ రమేష్ మండ్ల రాజు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునీత బుచ్చమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు ప్రతినెల పారితోషకాలు వేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000వేలు ఇవ్వాలని అదనపు పనులకు అదరపు పారితోషకం ఇవ్వాలని ఆదివారము మరియు పండుగ సెలవులు ఇవ్వాలని డ్రై డే వారంలో ఒకరోజు మాత్రమే నిర్వహించాలని అర్హులైన ఆశ వర్కర్లకు ఏఎన్ఎం జిఎన్ఎమ్ పోస్టులలో ప్రమోషన్ కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షల రూపాయలు ఇవ్వాలని వస్తున్న పారితోషకంలో సగం పెన్షన్ నిర్ణయించాలని ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ సిఐటియు జిల్లా నాయకులు నందిమల్ల రాములు ప్రజానాట్యమండలి నాయకులు మధు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి భాగ్య జిల్లా ఉపాధ్యక్షులు గిరిజ నవనీత శ్యామల, సంధ్య , అనసూయ , జ్యోతి, చిన్నమ్మ, బాలమణి , భాగ్య, శారద, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18000వేలు ఇవ్వాలి)

