Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శవ రాజకీయాలు మానుకోవాలి

శవ రాజకీయాలు మానుకోవాలి

0

శవ రాజకీయాలు మానుకోవాలి

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం టి. అన్నవరం గ్రామంలో శనివారం రాత్రి ఉత్సవాల చందాల వ్యవహారంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగితే దాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలుగుదేశం పార్టీకి అండగట్టటం ఆయన మూర్ఘత్వమని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఆదివారం రాత్రి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఘర్షణ పడ్డ ప్రసాదు, గోపి వారు ఇరువురు వైసీపీకి చెందిన వారేనన్నారు. గోపి చందా అడిగే క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగిందని, దీంతో ప్రసాద్ గాయపడటం జరిగిందని జీవి అన్నారు. గతంలో ఒక కుటుంబం బ్రహ్మనాయుడు పొలంలో పనిచేస్తూ ఉండేవారని ఇటీవల కాలంలో వారిని తీసివేయడంతో ఆ కుటుంబాలు కక్షలు పెంచుకున్నాయన్నారు. ఈ గొడవను మంత్రి లోకేష్ కు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముడి పెట్టడం ఏంటని జీవీ ప్రశించారు. ఐదేళ్లు శవ రాజకీయాలు చేసిన జగన్, బ్రహ్మనాయుడు ఆ బుద్ధులు ఇంకా మార్చుకో లేదన్నారు. పులివెందులలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో వారికి మతి భ్రమించిందని జీవి అన్నారు. ఇక బొల్లా బ్రహ్మనాయుడు తో తిరిగే నాయకులు, కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలని, దగ్గర ఉన్న వారిని ఏదో చేసి ఇతరులపై అబండాలు వేస్తారని జీవి అన్నారు. జీడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణను అది తెలుగుదేశం పార్టీపై నెట్టటం బ్రహ్మనాయుడు అవివేకమన్నారు. ఎన్నికల్లో బ్రహ్మనాయుడుని ప్రజలు చిత్తుగా ఓడించిన నాటి నుండి ఆయనకు మతి భ్రమించిందని మక్కెన అన్నారు. ఈ సమావేశంలో యార్డు చైర్మన్ మురళి యాదవ్, గోవిందరాజులు, కొమ్మ శ్రీనివాసరావు పాల్గొన్నారు. (Story:శవ రాజకీయాలు మానుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version