Home వార్తలు తెలంగాణ చిట్యాల చెక్ డ్యాంని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు

చిట్యాల చెక్ డ్యాంని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు

0

చిట్యాల చెక్ డ్యాంని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు

న్యూస్ తెలుగు/వనపర్తి : గత ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి కృషి తోనే చిట్యాల వాగుపై మూడు చెక్ డ్యాములు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయడం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేశారు. ఈ నీటితో చిట్యాల పరమటి తండా, చిమనగుంటపల్లి గ్రామాలకి చెందిన రైతులకి దాదాపు 5 వేల ఎకరాలు సమృద్ధిగా పంటలు పండించుకుంటున్నారు. గ్రామ రైతుల పిలుపు మేరకు బి ఆర్ ఎస్ నాయకుల చిట్యాల చెక్ డ్యాం ని సందర్శంచారు. మళ్లీ బి ఆర్ ఎస్ ప్రభుత్వమే రావాలి నిరంజన్ రెడ్డి గెలవాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. చేతగాని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నీళ్లు పుష్కలంగా ఉండి పంటలు సమృద్ధిగా పండుతున్న రైతులకి సకాలంలో ఎరువులు ఇవ్వలేని అసమర్థతకి మారుపేరుగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలను కూల్చేదాక నిద్రపొమని అక్కడి రైతులు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బిఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధివాకిటి శ్రీధర్,మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం, సింగిల్ విండో అధ్యక్షులు వెంకట్ రావు,రఘువర్ధన్ రెడ్డి, చిట్యాల మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు, మాధవరెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, పుల్ సింగ్ నాయక్, సుధాకర్, కురుమూర్తి, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(Story : చిట్యాల చెక్ డ్యాంని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version