ఫొటోగ్రాఫర్ లకు అవసరమైన వసతులను సమకూర్చడానికి సదా సిద్ధం
తెలుగు/వినుకొండ : ఆర్ట్ ఫొటోగ్రఫీ వంటి కళలో అంతర్జాతీయంగా రాణిస్తున్న వినుకొండ ఫొటోగ్రాఫర్ మిత్రులకు అభినందనలు తెలుపుతూ వారు పోటీలకు వెళ్లడానికి అవసరమైన ప్రాధమిక వసతులను సమకూర్చడానికి రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ సదా సిద్ధంగా ఉంటుందని క్లబ్ అధ్యక్షుడు ఏరువ వెంకట నారాయణ అన్నారు. 186 వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్. జి. ఓ హోం లో ఫోటోగ్రాఫర్ మిత్రులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సత్కారములు నిర్వహించారు. జాతీయంగాను , రాష్ట్రస్థాయిలోను ఉత్తమ ఫోటోగ్రాఫర్ లుగా అవార్డులు సాధించిన వంగపల్లి బ్రహ్మయ్య , కేసనపల్లి సుబ్బారావు లతో పాటు సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ కోకా సుబ్బారావు మరియు వర్ధమాన ఫోటోగ్రాఫర్లు, పాపగంటి వినీల్ , గోళ్ల మల్లికార్జున లను ఘనం గా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఎస్. కె. బాజీ , కోశాధికారి పొత్తూరి నవీన్ , క్లబ్ జిల్లా ముఖ్యులు ఆలా శ్రీనివాసరావు, చిరుమామిల్ల కోటేశ్వరరావు, ముత్తినేని గిరిబాబు, నాగేందృడు మాష్టారు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్ష , కార్యదర్శులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి, గుత్తా గురునాథం, క్లబ్ డైరెక్టర్లు షేక్ మస్తాన్, మాదాల హనుమంతరావు, క్లబ్ మాజీ కోశాధికారి షేక్ నాయబ్ రసూల్ , క్లబ్ సభ్యులు గాలి చిన కోటేశ్వరరావు మరియు సత్కార గ్రహీతల కుటుంబ సభ్యులు , మిత్రులు పాల్గొన్నారు. (Story:ఫొటోగ్రాఫర్ లకు అవసరమైన వసతులను సమకూర్చడానికి సదా సిద్ధం)

