Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ ఎన్ఎస్పీ కాలవపై కరెంటు తీగలు తొలగించాలని  రైతుల ఆందోళన

 ఎన్ఎస్పీ కాలవపై కరెంటు తీగలు తొలగించాలని  రైతుల ఆందోళన

 ఎన్ఎస్పీ కాలవపై కరెంటు తీగలు తొలగించాలని  రైతుల ఆందోళన

న్యూస్ తెలుగు/వినుకొండ  : విఠంరాజు పల్లి, బ్రాహ్మణపల్లి ఎన్ఎస్పి కాలువపై కరెంటు స్తంభం తీగలు ఉండటం వలన ప్రమాదం ఉన్నదని అడ్డంగా ఉన్న తీగలు తొలగించాలని రైతులు, ప్రజా సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. గతంలో విద్యుత్ అధికారులకు అర్జీ ఇస్తే వచ్చి పరిశీలించి స్తంభం పడిపోకుండా రిపేర్ చేయిస్తే తీగలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. స్తంభం చుట్టుప్రక్కల రిపేర్ చేయించిన విద్యుత్ అధికారులు స్పందించలేదని, స్థానిక తహసిల్దార్ కి గ్రీవెన్స్ సెల్ మెమోరాండం ఇవ్వటం జరిగిందని, తక్షణమే రోడ్డుపై అడ్డంగా ఉన్న కరెంటు తీగలు తొలగించి ప్రమాదాలు నివారించాలని రైతులు ఆందోళన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడియం రాష్ట్ర నాయకులు, వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, పగడాల చిన్నకోటిరెడ్డి, కంఠా రంగారావు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.(Story : ఎన్ఎస్పీ కాలవపై కరెంటు తీగలు తొలగించాలని  రైతుల ఆందోళన )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!