చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసినందుకు హర్షం
న్యూస్ తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్‌లోని చింతూరు ఏరియా హాస్పిటల్‌ను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినందుకు బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ విషయమై పలుమార్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ను కలసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. మారుమూల గ్రామాలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా గుర్తించి మంజూరు చేయడం జరిగింది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి గారి కృషి అమూల్యమని నాయకులు పేర్కొన్నారు.
ఈ ఆసుపత్రి ఏర్పాటుతో చింతూరు సహా నాలుగు మండలాల ప్రజలకు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల గిరిజనులు, ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్యసదుపాయాలు అందుబాటులోకి వచ్చింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి కి బిజెపి ముఖ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి అల్లూరి సీతారామరాజు జిల్లా మాజీ కార్యదర్శి పాయం వెంకయ్య,
చింతూరు బిజెపి మాజీ మండల అధ్యక్షుడు డి.వి.ఎస్. రమణారెడ్డి,
కట్టం ముత్తయ్య, కోట్ల వెంకన్న, జారె బొజ్జమ్మ, సోడే గంగమ్మ,ముటా మల్లేష్, శ్యామల లక్ష్మణరావు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసినందుకు హర్షం )

