ఘనంగా ప్రారంభమైన మహిళల బాల్ బ్యాట్మెంటన్ శిక్షణ శిబిరం..

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని నిర్మల ఐసీఎస్ఈ స్కూల్ క్యాంపస్ నందు
ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాట్మెంటన్ మహిళా జట్టు, సబ్ జూనియర్ బాలికల జట్లకు శిక్షణ శిబిరాన్ని నిర్మల విద్యాసంస్థల సుపీరియర్ సిస్టర్ సిసిలీ ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి మాట్లాడుతూ. కోచింగ్ క్యాంపులో బాగా మెలుకువలు నేర్చుకొని రాష్ట్రస్థాయి పోటీలలో రాణించాలని అన్నారు. ఈ కోచింగ్ క్యాంపు నందు ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి 24 మంది పాల్గొంటున్నారని కోచింగ్ క్యాంప్ నిర్వాహకులు జిల్లా జాయింట్ సెక్రెటరీ జోనా నాయక్ తెలిపారు. ఈ కోచింగ్ క్యాంపుకు ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ అధినేత మస్తాన్ వలి క్రీడా కారిణి లకు భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ కోచింగ్ క్యాంప్ ఈనెల 28 వరకు జరుగుతుందని అనంతరం ఇదే నెలలో 29 నుండి 31 వరకు ప్రకాశం జిల్లా చేవెళ్లలో జరిగే 11 వ రాష్ట్ర స్థాయి పోటీలలో క్రీడా కారిణి లు పాల్గొంటారని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ ఇన్నారెడ్డి, డాక్టర్ తేజ చంద్ర, ఎన్ఎస్పి పాఠశాల హెచ్ఎం సిహెచ్ వీరప్పయ్య లు క్రీడా కారిణి లను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పీ హై స్కూల్ పిడి ఆర్ రాధాకృష్ణమూర్తి, పీఈటీలు శ్రీను, గోపి, సంధ్య మరియు గుంటూరు జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై. శ్రీనివాసరావు, ఈ. శివశంకర్, ఉపాధ్యాయులు వీరాంజనేయులు, ఏడి ఆర్ ఆంజనేయులు, పాల్గొన్నారు.(Story:ఘనంగా ప్రారంభమైన మహిళల బాల్ బ్యాట్మెంటన్ శిక్షణ శిబిరం..)

