Homeసినిమాఓటీటీసోనీ లివ్‌లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’

సోనీ లివ్‌లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’

సోనీ లివ్‌లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: సోనీ లివ్‌లో ఈ ఏడాది రానున్న మలయాళీ ఒరిజినల్ సిరీస్‌ల్లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా, త్రివేండ్రం బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఈ డార్క్ యాక్షన్ కామెడీ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 29న మలయాళం, తెలుగు, తమిళ్ & హింది లో రానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అనే టైటిల్‌ను బట్టి చూస్తేనే కథ ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. ఈ కథలో నలుగురు యువకులు, మురికివాడ నుండి వచ్చిన ఒక చిన్న పిల్లవాడు ఉంటారు. ఇక ఈ ఊర్లో ఆలయ ఉత్సవం జరిపి తమ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది.  ఇక ఈ క్రమంలో వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? ప్రత్యర్థుల నుంచి వచ్చే సమస్యలు ఏంటి? అక్కడి పూలు, పాల వ్యాపారాలను నియంత్రించే స్థానిక గ్యాంగ్ స్టర్‌తో ఈ గ్యాంగ్‌కు వచ్చే ప్రమాదం ఏంటి? అన్నదే కథ.

మ్యాన్‌కైండ్ సినిమాస్ నిర్మించిన ఈ సిరీస్‌కు క్రిషాంద్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో జగదీష్, ఇంద్రన్స్, విజయరాఘవన్, హకీం షా, దర్శన రాజేంద్రన్, సంజు శివరామ్, సచిన్, శాంతి బాలచంద్రన్, నిరంజ్ మణియన్ పిళ్లై, శ్రీనాథ్ బాబు, శంబు మీనన్, ప్రశాంత్ అలెక్స్, రాహుల్ రాజగోపాల్, విష్ణు అగస్త్య వంటి వారు నటించారు. డార్క్ కామెడీ, యదార్థ ఘటనలు, ఎమోషన్స్‌తో తీసిన ఈ ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’  ఆగస్టు 29 నుండి మలయాళం, తెలుగు, తమిళ్ & హింది భాషలలో  సోనీ LIVలో మాత్రమే ప్రసారం కానుంది.  (Story:సోనీ లివ్‌లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!