జిల్లా మహిళల బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలన
న్యూస్ తెలుగు/వినుకొండ : నిర్మలా ఐసీఎస్ఈ స్కూల్ క్యాంపస్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా మహిళల బాల్ బ్యాడ్మింటన్ శిక్షణా ఏర్పాట్లను పాఠశాల సుపీరియర్ సిస్టర్ సిసిలీ , హెడ్మిస్సెస్ సిస్టర్ రాణి మరియు పాఠశాల పి ఈ టి శ్రీనివాసరావు, బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ జోనా నాయక్, ఎన్ఎస్ పి హై స్కూల్ పిడి ఆర్.రాధా కృష్ణ మూర్తి లు ఏర్పాట్ల ను పరిశీలించారు.శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రెటరీ వై. శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ ఈ. శివ శంకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు మహిళల జట్టు, సబ్ జూనియర్ బాలికల జట్లకు ఈ నెల 28 వరకు శిక్షణా శిబిరాలు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన జిల్లా జట్లు ఈనెల 29 నుండి 31 వరకు ప్రకాశం జిల్లా చేవూరు లో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొననున్నారు. క్రీడాకారులకు ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.డి. పి.ఆంజనేయులు, పి.ఈ.టి సంధ్య, మరియు పాఠశాల సిస్టర్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.(Story : జిల్లా మహిళల బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలన )

