ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు / చింతూరు : దిగవంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువరానివని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎస్ కె అహ్మద్ అలీ పేర్కొన్నారు. బుధవారం చింతూరు లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీ ప్రసంగిస్తూ పేదల అభ్యున్నతికి రాజీవ్ గాంధీ పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినారన్నారు. సాంకేతిక రంగంలో కూడా మన దేశం అభివృద్ధి రాజీవ్ గాంధీ హయాంలోనే చెందడం ప్రారంభం అయిందని అన్నారు. దళిత గిరిజన సంక్షేమానికి పెద్దపేట వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ యన్ టీ యూ సి మండల అధ్యక్షులు ఎస్.కె అక్బర్, నరేష్,బొక్కిలి ప్రసాదు. సోయం కన్నారావు, రవ్వ ప్రసాద్, ఎండి జవహర్, రవి, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, మహిళా నాయకులు జానకి,లక్ష్మీ, ఐశ్వర్య, అంజలి తదితరులు పాల్గొన్నారు.(story : ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు )

