అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని పరిశీలించిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : శ్రీరంగాపురం మండలం జనంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు నాయకులు వివిధ ప్రమాదాలలో గాయపడిన నాయకులను పరామర్శిస్తూ సుడిగాలి పర్యటన చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి గ్రామ రైతుల పిలుపుమేరకు జనంపేట బున్యదిపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మిస్తున్న ఉన్న పనులను పరిశీలించారు.ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పనులను పునర్ ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాల ప్రజలకు నేషనల్ హైవే రోడ్డు ఈ మార్గంలో దగ్గరవుతుందని మరియు పంట పొలాలకు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ఆకాంక్షించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇవ్వడం జరిగింది. టిపిసిసి ప్రదాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంపురం సహదేవుడు, ఈశ్వరయ్య నాయుడు,జానంపేట మహేశ్వర్ రెడ్డి,కృపాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు అక్షయ్ కుమార్, ఇర్ఫాన్,సోషల్ మీడియా పాతపల్లి చంద్రశేఖర్, nsui రోహిత్, శ్రీనివాస్ గౌడ్ భీముడు కురుమయ్య ఆనంద్ లోకేష్ వెంకటేష్ సాగర్ ఇమ్రాన్ నరసింహ యాదవ్, గట్టు రాజు, కిరణ్ కుమార్, గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.(Story : అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని పరిశీలించిన డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి )

