మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన జిల్లెల
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి మండల్ మాజీ జెడ్పిటిసి వెంకటన్న యాదవ్ రోడ్డు ప్రమాదం లో గాయపడిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు వెంకటన్న యాదవ్ ను పరామర్శించారు. ప్రమాదం జరిగిన సంఘటనను అడిగి తెలుసుకుని వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం తీసుకోని త్వరగా కోలుకోవాలని వెంకటన్న యాదవ్ కు సూచించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, సీనియర్ నాయకులు సహదేవుడు, పెద్దమందడి మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.(Story:మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన జిల్లెల)

