Home వార్తలు భారత్‌లో కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి

భారత్‌లో కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి

0

భారత్‌లో కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీః ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా, భారతదేశంలోని ప్రముఖ సూపర్-స్పెషాలిటీ కంటి ఆసుపత్రుల నెట్‌వర్క్ సెంట‌ర్ ఫ‌ర్ సైట్‌, వయస్సుతో వచ్చే కంటి వ్యాధులపై సమయానికి చికిత్స చేయడం ఎంత ముఖ్యమో గుర్తుచేసింది. దేశంలో 60 ఏళ్లకు పైబడిన 14 కోట్లకు పైగా ప్రజలు ఉన్నారు, వారిలో దాదాపు ముగ్గురిలో ఒకరు చూపు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా, అంధత్వం కేసులలో 80 శాతం నివారించదగినవే. అయినప్పటికీ, అపోహలు, ఆలస్యమైన చికిత్స కారణంగా అనేకమంది వృద్ధులు తమ చూపును కోల్పోతున్నారు. భారతదేశంలో అంధత్వానికి ప్రధాన కారణమైన ముత్యమందు (కేట‌రాక్ట్‌), ఇప్పుడు ఆధునిక బ్లేడ్లెస్, రోబోటిక్ లేజ‌ర్ శ‌స్త్రచికిత్స ద్వారా అదే రోజున న‌యం చేయ‌వ‌చ్చు. గ్లాకోమాను తరచుగా “సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్” అని పిలుస్తారు. ఈ నేప‌థ్యంలో కంటి వ్యాధుల‌పై జాగ్రత్తల కోసం అవగాహన కల్పించేందుకు, సెంటర్ ఫ‌ర్ సైట్ ఫిట్‌నెస్ ఐకాన్ మిలిండ్ సోమ‌న్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఆయన క్రియాశీల వృద్ధాప్యం, సమగ్ర ఆరోగ్యానికి ప్రతీక. ఈ ప్రచారం కుటుంబాలకు గుర్తుచేస్తోంది. కంటి పరీక్షలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యంకాదని సెంట‌ర్ ఫ‌ర్ సైట్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిట‌ల్స్ చైర్మ‌న్‌, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ మ‌హిపాల్ ఎస్‌.స‌చ్‌దేవ్ అన్నారు. (Story:భారత్‌లో కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version