ఆదివాసి ఆవాజ్ సోషల్ మీడియా శిక్షణకు ఎంపిక
న్యూస్ తెలుగు / చింతూరు: ఈనెల 21 నుండి 26 వరకు ఛత్తీస్గడ్ రాష్ట్రం లోని జాస్పూర్లో జరిగే ఆదివాసి ఆవాజ్ సోషల్ మీడియా ట్రైనింగ్ ప్రోగ్రాం షాప్ కు ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు మండలంలోని వేకవారిగూడెం గ్రామానికి చెందిన వేక లెనిన్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ భారత దేశంలోని ఆదివాసీలు, గిరిజన గొంతులను, సాంస్కృతిక, సాంప్రదాయాలను పరిరక్షించడానికి, వాశీల మీద జరుగుతున్నటువంటి నిర్బంధం, అన్యాయాలను, సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి, ఆదివాసి ఆవాజ్ శిక్షణ ప్రొఫెషనల్ లో నాణ్యత వీడియోలను రూపొందించడానికి తగు అవసరమైన నైపుణ్యాలను నేర్పుతోందని అన్నారు. అంతేగాక దృశ్యపరంగా ఆకర్షణీయంగా ఉండే వీడియోలను ఎలా తీయాలి, ఎలా సవరించాలో, ఎలా తయారు చేయాలో శిక్షణ లో నేర్పుతారని లెనిన్ తెలిపారు.(Story:ఆదివాసి ఆవాజ్ సోషల్ మీడియా శిక్షణకు ఎంపిక)

