సాలూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రత్తి ,వరి, మొక్కజొన్న పంటలో స సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక లాభాలు సాధించవచ్చని సాలూరు వ్యవసాయ అధికారి కె శిరీష తెలిపారు. మంగళవారం సాలూరు మండలం బోరబంద మరియు గుమడాం గ్రామములలో గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డి ఆర్ సి ద్వారా (పంటలలో మేలైన యాజమాన్య పద్దతులును రైతులకు వివరించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కె వి కె రాస్తాకుంట బాయ్ ఎస్ ఎమ్ ఎస్ (సబ్జెక్టు మేటర్ స్పెషలిస్ట్ ) వారు పాల్గున్నారు, అమృత వీణ గారు మాట్లాడుతూ వరి మరియు మొక్కజొన్న లో యాజమాన్య పద్దతలు తెలియజేశారు.అను వెర్ట్నరీ డాక్టర్ కోళ్లు పెంపకం మరియు ఆవు ల్లో, గొర్రెలు లో వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు, వ్యవసాయ అధికారి మాట్లాడాతూ రైతులు యూరియా మోతాదుకు మించి వినియోగించడం వలన పంట పురుగులు మరియు తెగుళ్ల బెడదకు గురి అవుతుందని తెలిపారు.కనుక తగిన మోతాదులో మాత్రమే యూరియా పంటకు వినియోగించాలని తెలియచేశారు అలానే రైతులందరూ వ్యవసాయ సహాయకులు ని సంప్రదించి ఈ పంట తప్ప కుండా చేసుకోవాలని తెలియచేశారు,మరియు ప్రస్తుత పరిస్థితులలో నానో యూరియా వాడుక ,మరియు కలుగు లాభాలు గూర్చి వివరించడం జరిగింది.సాలూరు ఏ డి ఏ మాట్లాడుతూ వరిలో ఎరువులు యాజమాన్యం వాటిని ఏ విదంగా వేసుకోవాలి ,,ఏ సమయములో వేసుకోవాలి భూమికి ఎంత మోతాదులో ఎరువులు తీసుకుంటాయి అనే విషయాలను రైతులకు వివరించడం జరిగింది.అదే విదంగా వివిధ రకాలైన పంటలకు ఎరువులు యాజమాన్యం ,,పంట తీసుకునే చర్య ప్రతి చర్య గూర్చి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. (Story:సాలూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం)

