ప్రజా సేవలో జనసేవాదళ్
దేశంలో అగ్ని ప్రమాదాలు వరదలు తుఫానులు ఉప్పెనలు సంభవించినప్పుడు
ప్రజాసేవలో నిమగ్నమయ్యేదే జన సేవాదళ్
ఒంగోలు నగరంలో జరిగే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు /వినుకొండ : ఒంగోలు నగరంలో ఆగస్టు 23, 24, 25 తేదీలలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని అజాద్ నగర్ కాలనీలో మంగళవారం జరిగిన జనసేవాదాలు శిక్షణ శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ. జనసేవాదళ్ ప్రజారక్షణలోనూ దేశంలో మత కలహాలు సంభవించినప్పుడు మతోన్మాదుల బారి నుండి మైనారిటీ ప్రజలను కాపాడుటలోనూ
దేశంలో వరదలు తుఫానులు ఉప్పెనలు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఇబ్బంది పడుతున్న ప్రజలసేవలో నిమగ్నమై వారికి సేవలు అందించుటలోను దేశంలో జన సేవాదళ్ కు ఒక చరిత్ర ఉందని అన్నారు. మంగళవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆజాద్ నగర్ లో జనసేవాదళ్ శిక్షణా కార్యక్రమం జరుగుతోందన్నారు. దేశ ప్రజలకు అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో వారికి సేవలు అందించుటకు సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేయుటకు జనసేవాదళ్ కార్యకర్తలు సైనికుల వల్లే ప్రజాసేవలో నిమగ్నమై పనిచేస్తారని అలా చేయుటకు యువకమ్యూనిస్టులను తయారుచేసి శిక్షణ శిబిరాలను నిర్వహించి క్రమశిక్షణ గలిగిన జనసేవా దళ్ కార్యకర్తలను తయారు చేయడం జరుగుతుందని పార్టీ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినప్పుడు వీధులలో పట్టణాలలో క్రమశిక్షణ కలిగిన ర్యాలీ నిర్వహించాలంటే జనసేవాదళ్ ఇన్స్ట క్టర్లు ముందుండి ప్రజలకు ఇబ్బంది లేకుండా ర్యాలీలు నిర్వహిస్తారని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్రమహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 23, 24, 25 తేదీలలో జరుగుతున్న సందర్భంగా ప్రారంభ రోజైన 23వ తేదీన రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేయు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలతో వేలాది మందితో గొప్ప ప్రజాప్రదర్శన జరుగుతుందని అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే నారాయణ జాతీయ రైతు సంఘం నాయకులు రావుల వెంకయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే. రామకృష్ణ సహాయ కార్యదర్శులు కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి తదితర రాష్ట్ర ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు కావున పల్నాడు జిల్లా ఏడు నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని 23వ తేదీ జరుగు ప్రజాప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సండ్ర పాటి సైదా, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, మండల కార్యదర్శులు పిన్న బోయిన వెంకటేశ్వర్లు, కే మల్లికార్జున, కొండ్రముట్ల సుభాని, షేక్ కిషోర్, ఏఐవైఎఫ్ నాయకులు మరియబాబు, షేక్ మస్తాను, వెంకటేశ్వర్లు, స్కైలాబ్, రమణ, లక్ష్మి, దేవమ్మ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. (Story:ప్రజా సేవలో జనసేవాదళ్)

