జడ్పిహెచ్ స్కూల్‌కి జిరాక్స్ మిషన్..
ప్రింటర్ పంపిణీ
న్యూస్ తెలుగు/వినుకొండ : ప రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం లోని ఎన్ఎస్పీ కాలనీలో గల జడ్పీహెచ్ స్కూల్ నందు రోటరీ సభ్యులు గాండ్ల నాగేంద్రుడి సహకారంతో జిరాక్స్ మిషన్ ను ప్రింటర్ సౌకర్యార్థం సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. రోటరీ క్లబ్ అధ్యక్షులు వైవి నారాయణ మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలకు మా రోటరీ క్లబ్ ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ పి స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు మంచినీటి కొరత ఉన్నందున మా రోటరీ క్లబ్ ద్వారా త్వరలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కి జిరాక్స్ ప్రింట్ అందజేసిన రిటైర్డ్ మాస్టర్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వైవి నారాయణ సెక్రెటరీ ఎస్.కె బాజీ, మాజీ అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా క్యాబినెట్ సభ్యులు చిరుమామిళ్ల కోటేశ్వరరావు, ఆలా శ్రీనివాసరావు, మాజీ సెక్రెటరీ గుత్తా గురునాథం, క్లబ్ డైరెక్టర్ కూచి రామాంజనేయులు, ఎన్ పద్మజ, పి ఈ టి రాధాకృష్ణమూర్తి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.(Story:#Post Excerpt జడ్పిహెచ్ స్కూల్‌కి జిరాక్స్ మిషన్..ప్రింటర్ పంపిణీ)

