Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అవార్డులు అందుకొన్న వినుకొండ ఫోటోగ్రఫర్లు

అవార్డులు అందుకొన్న వినుకొండ ఫోటోగ్రఫర్లు

అవార్డులు అందుకొన్న వినుకొండ ఫోటోగ్రఫర్లు

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతిక కమిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సహకారంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వారు ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్బంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ లో ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025″ను,మరియు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో గోల్డెమెడల్, అవార్డ్ లను వినుకొండ ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మయ్య ,కేసనపల్లి సుబ్బారావు అందుకున్నారు. విజయవాడ లోని బాగలోత్సవ భవన్ లో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మరియు ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుక కార్యక్రమం లో ఈ అవార్డు ను కార్యక్రమ ముఖ్య అతిథి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పాయ్ వైస్ ప్రసిడెంట్ డాక్టర్ కొంపల్లి సుందర్ ,ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా వ్యవస్థాపక ఛైర్మన్ తమ్మా శ్రీనివాస రెడ్డి ,డా.అవనిగడ్డ ఎమ్మెల్యే మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ,మాజీ ఎంపీ డా.గోకరాజు గంగరాజు , టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు సీఈఓ ఆర్.మల్లిఖార్జునరావు అందచేశారు. ఈకార్యక్రమంలో ఫోటోగ్రఫీ అకాడమీ అఫ్ ఇండియా అధ్యక్షుడు గొల్ల నారాయణరావు, వెంకటరమణ , ఉపాధ్యక్షులు డాక్టర్ కొంపల్లి సుందర్ వివిధ రాష్టాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.పట్టణ ఫోటోగ్రఫర్లు,పలువురు ప్రముఖులు వంగపల్లి బ్రహ్మయ్య,కేసనపల్లి సుబ్బరావుల ను అభినందించారు.(Story : అవార్డులు అందుకొన్న వినుకొండ ఫోటోగ్రఫర్లు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!