ప్రీ ప్రైమరీ పి ఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించాలి
విద్య బోధన బాధ్యతను అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ కీ ఇవ్వాలి
కలెక్టరేట్ ధర్నాలో CITU నాయకుల డిమాండ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాన్ని జయప్రదం చేశారు. మరి కుంట నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగ CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు R N రమేష్, మండ్ల రాజు, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు G శారద, కవిత, మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించాలని వాటి విద్య బోధనాన్ని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ కి అదనపు బాధ్యతతో పాటు అదనపు వేతనం ఇవ్వాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచ తప్పకుండా ఆచరిస్తుందని, ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే ఆలోచనలను విరమించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ వ్యవస్థనే 6 సంవత్సరాల లోపు పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వాలని ప్రాథమిక విద్య అభ్యసన చేయాలని ఐసిడిఎస్ ను 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో నెలకొలపడం జరిగింది.కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి నూతన జాతీయ విద్య విధానం ను తీసుకొచమని అంటున్నారు, 6 సంవత్సరలలోని పిల్లలకి విద్య తోపాటు పౌష్టిక ఆహారం అవసరం అన్ని అది అంగన్వాడీ సెంటర్స్ లో అందుతుంది అన్ని అన్నారు.అతి ముఖ్యమైన 6 సంవత్సరాలలోని పిల్లలకు మానసిక శారీరక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నది. ప్రాథమిక పాఠశాలలో నిర్వహించ తలపెట్టిన విద్యా వాలంటరీలకి నిర్ణయించిన వేతన్ననీ అదనంగా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కి ఇవ్వాలి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్లలో చదవడానికి ప్రభుత్వం అనుమతిని ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ లో పెండింగ్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ఐసిడిఎస్ కు సంబంధం లేని బిఎల్ఓ డ్యూటీని రద్దు చేయాలినీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో CITU జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, జిల్లా ఉపాధ్యక్షులు సూర్యవంశం రాము, అంగన్వాడి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు జ్యోతి, సుమతి, భాగ్యమ్మ, మంజుల, కృష్ణవేణి, తిరుపతమ్మ, సంగీత, అరుణ, CITU జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రీ ప్రైమరీ పి ఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించాలి)
