Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆగస్టు 23న జరిగే ప్రజా ప్రదర్శనలోను, బహిరంగ సభ లోను వేలాదిగా పాల్గొనండి

న్యూస్ తెలుగు/వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, ఆగస్టు 23న ఒంగోలులో జరిగే ప్రదర్శనలో, బహిరంగ సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు వినుకొండ శివయ్య భవనంలో సిపిఐ 28వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆగస్టు 23 24 25 తేదీలలో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని ప్రారంభ రోజైన ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మహాసభలకు విచ్చేయు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు నగరంలో గొప్ప ర్యాలీని నిర్వహించనున్నాయని ఈ ర్యాలీ అనంతరం గొప్ప బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరావు, కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి, తదితర రాష్ట్ర ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. పల్నాడు జిల్లాలోని పార్టీ శ్రేణులు ప్రజాసంఘాలు అభిమానులు అందరూ ఈ ప్రదర్శన బహిరంగ సభలలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, పట్టణ కార్యదర్శి పఠాన్ లాల్ ఖాన్, ఉలవలపూడి రాము, నాయకులు వూట్ల రామారావు, రాయబారం వందనం, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఎం సుబ్బారావు, షేక్ కిషోర్, సోమవరపు దావీదు, దూపాటి మార్కు, మరియ బాబు, షేక్ మస్తాన్, జెల్లీ వెంకటేశ్వర్లు, దుర్గా, సోడాల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!