ఆగస్టు 23న ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆగస్టు 23, 24, 25 తేదీలలో ఒంగోలు నగరంలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పార్టీ శ్రేణులకు తెలిపారు. సోమవారం నాడు వినుకొండ పట్టణంలోని శివయ్య భవనంలో జరిగిన వినుకొండ నియోజకవర్గ కమిటీ మరియు సమితి సమావేశానికి కామ్రేడ్ పిన్నబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మారుతి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖల నుండి నియోజకవర్గ, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర,జాతీయ స్థాయి వరకు జరుగుతున్న మహాసభల్లో భాగంగా మన రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న సందర్భంగా 23వ తేదీన ఒంగోలు నగరంలో రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేయు పార్టీ శ్రేణులతో ప్రజాసంఘాలతో భారీ ప్రదర్శన అనంతరం గొప్ప బహిరంగ సభ జరగబోతున్నాయని ఈ ప్రదర్శన బహిరంగ సభలలో జాతీయ రాష్ట్ర నాయకులు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా, జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె నారాయణ, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర ప్రజా సంఘాల బాధ్యులు, నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. కావున జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు ప్రజా సంఘాలు వేలాదిగా ఒంగోలు మహా నగరానికి మీరు నిర్ణయించుకున్న వాహనాలలో వేలాదిగా తరలివచ్చి ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి పట్టణం నుండి వాహనాలలో 500 మంది పార్టీ కార్యకర్తలను ప్రదర్శనకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. పట్టణ కార్యదర్శులు రాము సండ్రపాటి సైదా తదితరులు మాట్లాడుతూ మహాసభలను విజయవంతం చేయటానికి ప్రదర్శన బహిరంగ సభలను జయప్రదం చేయుటకు పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున తరలిస్తామని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో మాజీ వైస్ చైర్మన్, సండ్రపాటి సైదా, పటాన్ లాల్ ఖాన్,ఎఐ వైయఫ్ జిల్లా అధ్యక్షులు ఎం సుబ్బారావు, పిన్నబోయిన వెంకటేశ్వర్లు , వూట్ల రామారావు,షేక్ కిషోర్, అంజయ్య షేక్ మస్తాన్ నాగరాజు స్కైలాబ్ ధూపాటి మార్కు, సోమవారపు దావీదు, జల్లి వెంకటేశ్వర్లు, సోడాల సాంబయ్య, దుర్గ ,రమణ, అంజమ్మ, గోవింద లక్ష్మి, మరియబాబు తదితరులు పాల్గొన్నారు. (Story:ఆగస్టు 23న ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి)

