Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నిస్వార్ధ నాయకుడు ఖాసింఖాన్: జీవి

నిస్వార్ధ నాయకుడు ఖాసింఖాన్: జీవి

0

నిస్వార్ధ నాయకుడు ఖాసింఖాన్: జీవి

న్యూస్ తెలుగు/వినుకొండ : వినకొండ మాజీ సర్పంచ్ స్వర్గీయ పఠాన్ ఖాసింఖాన్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పెద్ద మసీదు సెంటర్లో ఉన్న ఖాసింఖాన్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పోరాడిన గొప్ప నాయకుడు పఠాన్ ఖాసిం ఖాన్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అలాగే తొలుతగా పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్, సిపిఐ సీనియర్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, సిపిఐ పట్టణ మాజీ కార్యదర్శి పి. లాల్ ఖాన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, న్యాయవాది పి. జె. లూకా, ఎస్.కె కిషోర్, పి. అయూబ్ ఖాన్, పివి సురేష్ బాబు, తదితరులు పటాన్ ఖాసింఖాన్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. ఖాసిం ఖాన్ సర్పంచ్ గా చేసిన కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ అన్ని వార్డుల్లో పంచాయతీ నిధులు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసేవారు అన్నారు. అలాగే మరోపక్క భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో అన్ని వర్గాలలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకుంటూ వారికి ఇళ్ల స్థలాల కోసం గృహ వసతి కోసం పోరాటాలు చేసి ప్రభుత్వం ద్వారా ఆ పేదలకు న్యాయం చేకూరే విధంగా ఉద్యమాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఖాసింఖాన్ కుటుంబ సభ్యులు, సిపిఐ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. (Story:నిస్వార్ధ నాయకుడు ఖాసింఖాన్: జీవి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version