బోనాల ఉత్సవంలో పాల్గొన్న జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఏనుగుపాలెం రోడ్డులో ఉన్న శ్రీ అంకాళమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు, కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు చీఫ్ విప్ జీవి కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. ఇలాంటి ఉత్సవాలు మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడతాయని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. (Story:బోనాల ఉత్సవంలో పాల్గొన్న జీవి)

