కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న గుమ్మడి సంధ్యారాణి
న్యూస్ తెలుగు/ సాలూరు : శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్లో పాల్గొని రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నానని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు శనివారం సాలూరు పట్టణంలోని గొల్ల వీధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆమె కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక గోపికలు, గోపాలకులు సాంప్రదాయ రీతిలో శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రుక్మిణి, గోపికల వేషధారణలో ఆకట్టుకునే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉండి పంటలు బాగా పండాలని ఆ స్వామి వారిని కోరుకున్నానని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. (Story:కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న గుమ్మడి సంధ్యారాణి)

