కూటమి ప్రభుత్వం లో అబద్ధాలు జోరు ప్రజలు బేజారు
న్యూస్ తెలుగు /సాలూరు : కూటమి ప్రభుత్వం లో అబద్ధాలు జోరు ప్రజలు బేజారు, మంత్రి సంధ్యారాణి అబద్దాల ఆడడంలో ఆడితేరి పోయారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు పీడిక రాజన్న దొర అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక మంత్రి సంధ్యారాణి అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకుండా ఎదుటివారిని నిందించడం అలవాటుగా మారిపోయింది అని అన్నారు. గత వారం మంత్రి విలేకరుల సమావేశంలో 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి సాలూరు నియోజకవర్గానికి రాజన్న దొర ఎటువంటి పనులు చేయలేదని అన్నారని, సాలూరు నియోజకవర్గం నా హయాయములో ఎక్కువ అభివృద్ధి జరిగిందో లేకపోతే మీరు ఎమ్మెల్సీగా, ఎస్టీ కమిటీ సభ్యులుగా, శ్రీ శిశు సంక్షేమ రీజనల్ డైరెక్టర్ గా ప్రస్తుతం మంత్రిగా ఉన్న మీరు సాలూరు నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన శాఖ మంత్రిగా ఉండి గిరిజనులకు ఎన్నో హామీ ఇచ్చారని , జీవో నెంబర్ 3 అమలు చేస్తామని అన్నారని ఇప్పటికే అమలు చేయలేదని అన్నారు. గిరిజనులకు స్పెషల్ డిఎస్సి ఇస్తామని వాగ్దానం చేశారని ఆ హామీ ఎక్కడ ఉందని తెలిపారు. అధికారంలోకి రావడానికి గిరిజనులకు అనేక హామీలు ఇచ్చారని ఆ హామీలు అమలు చేయలేదని అన్నారు. కొటీయ సమస్య సమస్య మీరు ఎమ్మెల్సీగా అధికారంలోని ఉండేటప్పుడే మొదలైందని మిమ్మల్ని విలేకరులు ప్రశ్నిస్తే 40 సంవత్సరాల బట్టి సమస్య ఉందని ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడడం అని మీరు అన్నారా లేదా తెలియజేశారు. కోటియా గిరిజన ప్రజలకు మీరు న్యాయం చేయాలంటే ఇదే సరి అయిన సమయమని తెలిపారు. ఎందుకంటే ఒరిస్సాలో బిజెపి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఉంది కాబట్టి, మీరు, రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి కొట్టిన సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేయాలని లేని పక్షంలో గిరిజన ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. మీరు గెలిచిన వెంటనే సాలూరు పట్టణంలో ఉన్న మహిళలకు మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారని ఇప్పటివరకు ఆ మరుగుదొడ్లు నిర్మించి లేదని అన్నారు. ఆ మహిళల ఆత్మగౌరవం ఈరోజు తీసుకొచ్చారా అని తెలియజేశారు. గతంలో నేనే ఎమ్మెల్యే ఉండే టైంలో కొట్టక్కీ బ్రిడ్జి, సాలూరు బైపాస్ రోడ్డు, సాలూరు తాసిల్దార్ కార్యాలయం, వై టి సి బిల్డింగ్, డిగ్రీ కాలేజీ అదనపు తరగతుల నిర్మాణం, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఉన్న కొన్ని గిడ్డింగులు, ఏపీ సీడ్ కార్పొరేషన్ కార్యాలయం, ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో నా హయాంలో జరిగాయని తెలిపారు. నేను ఒకవేళ అబద్ధం అని మీరు నిరూపిస్తే, మీరు నచ్చిన ప్లేస్ కు వచ్చి చర్చకు సిద్ధంగా ఉంటారా అని అన్నారు, గెలిచిన రెండు నెలల్లోనే సాలూరు వంద పలకల హాస్పిటల్ పూర్తి చేస్తానని ఆస్పత్రికి వెళ్లి పత్రికా సమావేశం పెట్టి చెప్పారని 14 నెలలు అయినా ఇప్పటికీ ఎందుకు ప్రారంభించ లేదో మీరు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. హాస్పిటల్ నిర్మాణం 75% వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని అన్నారు. సాలూరు మున్సిపాలిటీలో నేను గ్రాంట్ రూపంలో కోట్లాది నిధులు తెచ్చి ప్రతి వార్డులో పైలెట్ వాటర్ స్కీములు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని తెలియజేశారు, మీరు సాలూరు గ్రామ దేవత పండుకి అప్పుగా రెండు కోట్లు తెచ్చారని అది ఎప్పుడైనా ప్రజలపై భారం పడుతుందని గుర్తు చేశారు . ఆ పనులు సాలూరు మున్సిపాలిటీ కౌన్సిల్స్ అడ్డుకుంటారని అబద్ధాలు ఆడడం నిజం కాదా అని అన్నారు. ఒక మంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పడం గ్లోబిల్ ప్రచారం చేయడం, సాలూరు నియోజకవర్గ ప్రజలు మీ పార్టీ కార్యకర్తలే మీరు మాట్లాడుతున్న అసత్యపు మాటలు చర్చించుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఒక బాధ్యత యుతమైన మంత్రిగా నిజం మాట్లాడి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని నెరవేర్చవలసిన బాధ్యత మీపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి గిరి రఘు, వైసిపి నాయకులు, బిసపు బాలకృష్ణ, ఎమ్మెస్ నారాయణ, సింగరపు ఈశ్వర రావు, మేకల శంకర్రావు, జె శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు. (Story:కూటమి ప్రభుత్వం లో అబద్ధాలు జోరు ప్రజలు బేజారు)

