వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలి
న్యూస్ తెలుగు/సాలూరు : వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు శనివారం స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో సాలూరు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షునిగా నాగోలు తాతాజీ సభ్యులు ప్రమాణ స్వీకరం చేయించారు. వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ, భక్తుల సేవ కోసం సమిష్టిగా కృషి చేయాలని, దేవస్థానం అభివృద్ధి కోసం పారదర్శకతతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. (Story:వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలి)

