Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలాన్ని కాపాడుకోవాలి

మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలాన్ని కాపాడుకోవాలి

మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలాన్ని కాపాడుకోవాలి

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం: జీవీ ఆంజనేయులు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన

న్యూస్ తెలుగు/ వినుకొండ : ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలంగా వచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. నాటి మహోద్యమ స్ఫూర్తిని గుర్తుచేసే ఆగస్టు -15 వేడుకలు ఏడాది మొత్తం ప్రగతి ప్రయాణం ప్రేరణకు మూలంగా పేర్కొన్నారు. ఆ విలువల్ని కాపాడుకుంటూ అభివృద్ధి, సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కూట మి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. వినుకొండలో 79వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు వంటి ఎంతోమంది మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమని కొనియాడారు. వారి పోరాటం స్వేచ్ఛ ఇచ్చిందని, ఆ స్వేచ్ఛను కాపాడుతూ అభివృద్ధి పథంలో నడవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సీఎం చంద్రబాబు రాష్ట్రా న్ని ఆర్థిక, విద్య, ఆరోగ్య, సాంకేతిక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపేలా ముందుకెళ్తున్నారని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా పింఛన్లు, విద్యార్థులకు తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించి పేదల ఉన్నతికి బాటలు వేశారన్నారు. గత వైసీపీ దుర్మార్గపు పాలనలో అరాచకాలు తప్ప రాజ్యాంగ విలువల్లేవని, రాజ్యాంగ విలువలు తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని మండిపడ్డారు. ఆ దుస్థితి మార్చుతూ స్వర్ణాంధ్రప్రదేశ్-2047 లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఒక్కో కుటుంబం తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలనే గొప్ప సంకల్పంతో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలనకు బాటలు వేస్తున్నామని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ గెలుపు ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా అభివర్ణించారు. భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా ప్రజాస్వామ్యం కొనసాగుతుందని, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తామని, ప్రజాస్వామ్య విలువలను కాపాడతామని పేర్కొన్నారు.

వెయ్యి అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా వినుకొండలో నిర్వహించిన హర్‌ఘర్ తిరంగ ర్యాలీలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. నరసరావుపేట రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం నుంచి శివయ్య స్తూపం సెంటర్ వరకు 1000 అడుగుల భారీ జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. ఆ ప్రదర్శనను చీఫ్ విప్ జీవీ జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ జెండా చేత పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో అధికారులు, ప్రజలు, విద్యార్థులు, యువత పాల్గొని దేశభక్తిని చాటారు. దేశ నాయకుల త్యాగాలు, భారత సంస్కృతిని తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. (Story:మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలాన్ని కాపాడుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!