Home వార్తలు తెలంగాణ స్పోర్ట్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

స్పోర్ట్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

0

స్పోర్ట్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన క్రికెట్ కోచర్ శంకర్ పెబ్బేరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న స్పోర్ట్స్ షాపును శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యతోపాటు విద్యార్థులకు క్రీడపై కూడా పట్టుండాలని క్రికెట్ క్రీడల్లో తర్ఫ్యూజ్ నిచ్చే శంకర్ స్వయంగా తానే స్పోర్ట్స్ షాప్ ను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే శంకర్ను అభినందించారు
యువకులు ఉన్నత చదులతో పాటు ప్రభుత్వపరమైన ఉద్యోగ సాధన కోసం ప్రయత్నిస్తూనే స్వయం ఉపాధి రంగాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రాములు, దయాకర్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, గంధం రాజశేఖర్, యుగంధర్ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:స్పోర్ట్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version