వినుకొండ సివిల్ కోర్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కోర్టు ప్రాంగణంలో ఇంచార్జ్ జడ్జి నరసరావుపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆశీర్వాదం పాల్ జండా వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసి, స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. భారత స్వాతంత్ర పోరాటం ఒక అలుపెరగని పోరాటం, ఎందరో త్యాగాలకు ప్రతీక, అహింస సిద్దాంతాన్ని ఏకతాటిపై నడిపించిన గాంధీ, కోట్లాది మంది భారతీయుల్లో స్పూర్తిని నింపారని, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్ గురు వంటి ఎందరో యోధులు వారి ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీసాల శ్రీనివాసరావు, సెక్రెటరీ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్, జాయింట్ సెక్రటరీ నీలం శేఖర్ బాబు, ట్రెజరర్ కం లైబ్రేరియన్ వరగాని శివ శంకర్ బాబు, ఏ.జి.పి. ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు, ఏ. పి. పి. దండే వెంకటేశ్వర్లు, నరసరావుపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ సీనియర్ ఏపీపీ అయినా కల్పనా, మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు,కోర్టు సిబ్బంది ,పోలీసులు,పాల్గొన్నారు. (Story:వినుకొండ సివిల్ కోర్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు)

