గీతమ్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక సిద్ధార్థ నగర్ లోని గీతమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ. బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల్లో చిక్కిన భారతదేశాన్ని కాపాడుకునేందుకు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం అని వివరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు. (Story:గీతమ్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు)

