10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ
న్యూస్ తెలుగు / సాలూరు : 10వ తరగతి ఉత్తీర్ణత లో ప్రధమ, ద్వితీయ స్థానం వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతులు పంపిణీ చేసిన ఎన్నారై ఉండ్రాల కృష్ణారావు జిల్లా పరిషత్ వేద సమాజం స్కూల్ పూర్వ విద్యార్థి విద్యార్థి {1998 _99} ఉండ్రాల కృష్ణారావు తన ద్రాతుతాన్ని చాటుకున్నారు..
జిల్లా పరిషత్ వేద సమాజం ఉన్నత పాఠశాలలో ఉంట్రాల కృష్ణారావు చదువుకొని అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటూ తన చదువుకున్న స్కూల్ కి గ్రామానికి ఏదో చేయాలని తప్పనతో ఈ సంవత్సరం అదే స్కూల్లో గత సంవత్సరం 10వ తరగతులు లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులలో ప్రధమ మార్కులు ద్వితీయ మార్కులు వచ్చిన విద్యార్థులకు నగదు బహుమతి కింద ప్రథమ బహుమతి పదివేల రూపాయలు ద్వితీయ బహుమతి కింద ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఏడాది నుండి సాలూరులో ఉన్న ఆరు హైస్కూల్లో మొదటి బహుమతి, రెండవ బహుమతి క్రింద నగదు బహుమతి కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించి వారి ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గున్న రాజు, నాగేశ్వరరావు, వార్డ్ కౌన్సిలర్ గొర్లె జగన్మోహన్రావు, ఆయన స్నేహితులు రవ్వ బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. (Story:10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ)

