ఉత్తమ సేవలందించిన కుటుంబంలో ఇద్దరికీ ప్రశంసా పత్రాలు

న్యూస్ తెలుగు/ చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లో చింతూరు ఐటీడీఏ పరిధిలో 79 వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఒకే కుటుంబానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుంపెనపల్లి.అచ్చమ్మ, చింతూరు డిప్యూటీ ఎంపీడీవో గుంపెనపల్లి.మోహన్ ప్రాజెక్టు అధికారి చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వీరు ఇరువురు అక్క తమ్ముళ్లు ఒకే కుటుంబం నుండి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఓకే కుటుంబంలో ఇద్దరికీ ప్రశంస పత్రం రావడం పట్ల స్థానిక పెద్దలు,రాజకీయ నాయకులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు అభినందనలు తెలియజేశారు. (Story:ఉత్తమ సేవలందించిన కుటుంబంలో ఇద్దరికీ ప్రశంసా పత్రాలు)

