వినుకొండ మునిసిపల్ అధికారులకు అవార్డులు
న్యూస్ తెలుగు/ వినుకొండ : స్వచ్చ సర్వేక్షణ 2025 లో భాగంగా వినుకొండ పురపాలక సంఘం నందు 100% ఇంటింటి చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయించడం, పారిశుధ్య నిర్వహణలో రాష్ట స్థాయిలో 9వ ర్యాంకు, దేశ స్థాయిలో 301 వ ర్యాంకు సాధించినందుకు, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ యం. సుభాష్ చంద్రబోస్, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పి.ఆది నారాయణ అవార్డు అందుకున్నారు. (Story:వినుకొండ మునిసిపల్ అధికారులకు అవార్డులు)
