ఉత్తమ సేవలందిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ కు అవార్డు
న్యూస్ తెలుగు /సాలూరు : ఉత్తమ సేవలకు గాను యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ కు అవార్డు
ఉత్తమమైన సేవలు అందించినందుకు గాను సాలూరు యూనియన్ బ్యాంక్ బ్రాంచి మేనేజర్ డి. రాజశేఖర్ కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డుకు ఎంపికయ్యారు. శుక్రవారం పార్వతీపురంలో రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ మాత్యులు గుమ్మిడి. సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ పథకాలను నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి అమలు చేస్తూ,ప్రజలకు చేరువ చేయడంలో కృషి చేశారు.ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు ఆయనకు అభినందనలు తెలిపారు. (Story:ఉత్తమ సేవలందిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్ కు అవార్డు)

