వినుకొండలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : దేశ స్వాతంత్ర సాధనలో ఎందరో దేశభక్తుల త్యాగాలు మరువలేనివని ప్రభుత్వ చీఫ్ విప్. సీనియర్ శాసనసభ్యులు ఆంజనేయులు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన కస్తూర్బా పాఠశాల, గురుకుల బాలికల పాఠశాల, తహసిల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, టిడిపి కార్యాలయం, పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో జీవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే పోలీస్ స్టేషన్ లో సిఐ శోభన్ బాబు, మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ దస్తగిరి షకీలా, ఆర్టీసీలో డిఎం జే నాగేశ్వరరావు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అలాగే గీతాంజలి విద్యాసంస్థలు, మున్సిపల్ కార్యాలయం అధికారులు సంయుక్తంగా నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు వెయ్యి అడుగుల జండాను పట్టుకొని ప్రదర్శన నిర్వహించగా, పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. అలాగే దేశభక్తుల వేషధారణలో విద్యార్థులు విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రదర్శన రెవెన్యూ కార్యాలయం వద్ద నుండి శివయ్య స్తూపం సెంటర్ వరకు సాగింది. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొన్నాయి. మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్, సానిటరీ అధికారి ఎస్కే ఇస్మాయిల్, తహసిల్దార్ సురేష్ నాయక్, డిప్యూటీ తాసిల్దార్ మురళీధర్ రావు, కూటమి నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:వినుకొండలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు)
