ఘనంగా79 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరులోని ఐటిడిఏ ప్రాంగణంలో 79 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం గురించి సాదాహరణంగా వివరించారు. ఐటీడీఏలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గురించి వివరించారు. కూనవరం మండలంలోని పైడిగూడెంలో తస్సార్ సిల్క్ ను అభివృద్ధి చేయుటకు గాను ఐదు కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఆటిట్యూడ్ ద్వారా నిర్వహించిన వివిధ కార్యక్రమాల ప్రగతి గురించి తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ప్రధానం చేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు శ్యామల వెంకట రామయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ టి డబ్ల్యూ అప్పారావు, అడిషనల్ ఎస్పీ అపూర్వ భరత్, అధికారులు, రాజకీయ ప్రముఖులు, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. (Story:ఘనంగా79 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు)
