చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

న్యూస్ తెలుగు/చింతూరు : స్వాతంత్ర వేడుకల్లో భాగంగా గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు దేశభక్తిని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. రత్న మాణిక్యం హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కళాశాల ప్రాంగణం నుంచి చింతూరు మెయిన్ రోడ్ ఆర్టీసీ బస్టాండ్ వరకు విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండాలు నినాదాలతో ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించి జాతీయ పతాక ప్రతిజ్ఞ చేసారు. ర్యాలీ చింతూరు మండలంలోని మెయిన్ రోడ్ వీధుల గుండా సాగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించింది.కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ జాతీయ పతాకం మన స్వేచ్ఛకు ప్రతీక, జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుని కర్తవ్యం, మన దేశ ఐక్యత కోసం ప్రతివారు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి.సాయికుమార్ మాట్లాడుతూ ప్రతి కార్యాలాయల పైన, ప్రతి ఇంటి పైన జాతీయ జెండా రెపరెపలాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్, సీనియర్ అధ్యాపకులు జి. , వెంకట్రావు, జి. హారతి, ఎస్. అప్పనమ్మ, కె. శకుంతల, కె. శైలజ, ఎం నాగ మోహన్ రావు, ఆర్ మౌనిక, బి. శ్రీనివాసరావు, పి మౌనిక, ఎస్ ఆనంద్, ఎన్ వివిఎస్ ఎన్ మూర్తి, శీనయ్య, సుబ్బారావు, కన్నయ్య విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ)

