Home వార్తలు తెలంగాణ ప్రజా పోరాటాల్లో సిపిఐ కి వందేళ్ళ చరిత్ర: శ్రీరామ్

ప్రజా పోరాటాల్లో సిపిఐ కి వందేళ్ళ చరిత్ర: శ్రీరామ్

0

ప్రజా పోరాటాల్లో సిపిఐ కి వందేళ్ళ చరిత్ర: శ్రీరామ్

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజా పోరాటాల్లో సిపిఐ కి వందేళ్ళ చరిత్ర ఉందని మరే రాజకీయ పార్టీకి ఇంత ఘన చరిత్ర లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే శ్రీరామ్ అన్నారు. గురువారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను విడుదల చేసి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో 1925, డిసెంబర్ 26న సిపిఐ ఆవిర్భవించి స్వాతంత్ర్యం కోసం అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపు ఇచ్చిన తొలి పార్టీ సిపిఐ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో సిపిఐ నిర్వహించిన తెలంగాణ సాహిద రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖిత తగ్గిందన్నారు. నిజాం పీడల నుంచి ప్రజలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందన్నారు. కార్మికులు కర్షకులు బడుగు బలహీన ప్రజల గొంతుకగా చట్టసభల్లో బయట పోరాటాలు నడిపిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కోసం సిపిఐ సాగించిన పోరాటం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. అంతటి చరిత్ర గల సిపిఐ నాలుగవ రాష్ట్ర మహాసభలు మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో ఈనెల 19 నుంచి 22 వరకు జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సీనియర్ నేత కళావతమ్మ, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్,సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ,చిన్న కురుమన్న, జయమ్మ, శిరీష,రాంబాబు,మహేష్,వంశి,విష్ణు,జ్యోతి,మైబుసు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజా పోరాటాల్లో సిపిఐ కి వందేళ్ళ చరిత్ర: శ్రీరామ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version