ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
న్యూస్ తెలుగు/సాలూరు : ఈనెల 13వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సాలూరు తహసిల్దార్ నీలకంఠరావు అన్నారు. గురువారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వాతావరణ శాఖా మరియు జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్, పార్వతీపురం మన్యం వారి ఆదేశముల ప్రాప్తికి తేది 13.8.2025ది నుండి 18.8.2025 ది వరకు అనగా సుమారు ఆరు రోజులు వరకు జిల్లా లో భారి నుండి అతి భారి వర్షములు కురిసే అవకాశము వున్నండనని, ప్రజలందరను సురక్షిత ప్రాంతాలలో వుండవలెనని తెలియజేశారు. ఆరు బయట , చెట్లు క్రింద వుండరాదని , ఇండ్ల నుండి వర్షం పడే సమయాలలో బయటకు రాకుడదని ప్రజలకు తెలియజేశారు.(Story:ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి)

