ప్రతి ఇంటిపై జాతీయ జెండాని ఎగరువేద్దాం
న్యూస్ తెలుగు /సాలూరు : ప్రతి ఇంటిపై జాతీయ జెండాని ఎగరవేయడం వలన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు . బుధవారం సాలూరు పట్టణంలో ” హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొని, ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని మరింతగా పెంచాలని తెలిపారు. దేశం పట్ల ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మెలగాలని అన్నారు. మనలో ఐక్యత సోదరి భావం పెంపొందించుకోవాలని అన్నారు. ర్యాలీ సాలూరు ఎం ఆర్ ఓ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమై, ఎస్ బి ఐ బ్యాంకు వరకు శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ పతాకాలు పట్టుకొని, “వందే మాతరం”, “భారత్ మాతాకి జై” వంటి దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్వతి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమాది తిరుపతిరావు, పప్పల మోహన్ రావు, డాక్టర్ శివకుమార్ , తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రతి ఇంటిపై జాతీయ జెండాని ఎగరువేద్దాం)

