Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ ఫోటోగ్రాఫర్ కు గోల్డ్ మెడల్

వినుకొండ ఫోటోగ్రాఫర్ కు గోల్డ్ మెడల్

0

వినుకొండ ఫోటోగ్రాఫర్ కు గోల్డ్ మెడల్

న్యూస్ తెలుగు /వినుకొండ : నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ పోటీలలో గోల్డెమెడల్, 3వ ప్లేస్అవార్డ్ ,క్యాష్ అవార్డు కు ఎంపికైన వంగపల్లి బ్రహ్మయ్య, ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సంధర్భంగా 186వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే కాంటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ కాంటెస్ట్ లో ఫోటో ట్రావెల్ విభాగంలో వంగపల్లి బ్రహ్మయ్య తీసిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం “రథోత్సవం” ఫోటో అవార్డు కి ఎంపికయింది. ఈ నెల 18వ తారీకు ఉదయం 11 గంటలకు విజయవాడలో బాలోత్సవ భవన్ లో డా, నుకసాని బాలాజీ ‘చైర్మన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ర్. మల్లికార్జునరావు, డైరెక్టర్ & సి. ఇ. ఓ అం. ప్ర. సృజనాత్మక సంస్కృతి సమితి వారిచే ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటో ట్రావెల్ విభాగంలో ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. వినుకొండ అసోసియేషన్ అధ్యక్షులు కేసనపల్లి సుబ్బారావు పలువురు ఫోటోగ్రాఫర్లు బ్రహ్మం ని అభినందించారు. ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ గ్రాండ్ మాస్టర్ తమ్మా శ్రీనివాసరెడ్డి ఎఫ్ఆర్పిఎస్ కి వంగపల్లి బ్రహ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. (Story:వినుకొండ ఫోటోగ్రాఫర్ కు గోల్డ్ మెడల్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version