ఆగస్టు 15 లోపు పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తాం
న్యూస్ తెలుగు/ సాలూరు : ఆగస్టు 15 వ తేదీ లోపు పోడు భూములకు సాగు చేస్తున్న గిరిజనులందరికీ పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆమె క్యాంపు కార్యాలయానికి సాలూరు, పక్క గ్రామాల నుండి పలు గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ పోడు పట్టా భూముల సమస్యలను వివరించారు. తాము తరతరాలుగా సాగుచేసుకుంటూ వస్తున్న పోడు భూములకు హక్కులు రావాలనే ఆకాంక్షతో, ఆమెను నేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె గిరిజనుల తో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ మన గిరిజనుల అభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని తెలిపారు. సమస్య పరిష్కారంపై పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు హామీ ఇస్తూ ఆగస్టు 15వ తేదీ నాటికి మీ అందరికీ పోడు పట్టా భూములు అందజేస్తామని ప్రకటించారు. ఇది మా ప్రభుత్వం ఇచ్చిన హామీ. గిరిజనుల హక్కులు, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ నేను మీ పక్షాన నిలుస్తాను” అని స్పష్టం చేశారు.
ఈ హామీతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తూ, సీఎం చంద్రబాబు మరియు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story:ఆగస్టు 15 లోపు పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తాం)

