గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 7500 కోట్లు
న్యూస్ తెలుగు /సాలూరు : గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి 7500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శివ సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు. గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం ఆమె క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల మంది తల్లుల ఖాతాలలోకి ₹1400 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. గిరిజన విద్యాభివృద్ధికి 373 పాఠశాలలకు ₹45 కోట్లు కేటాయించారని, వీటిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
సికిల్ సెల్ అనేమియా వ్యాధిగ్రస్తులైన 1500 మందికి ప్రతీ ఒక్కరికీ నెలకు ₹10,000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. సీతంపేట, పాచిపెంట, రంపచోడవరం, కె.ఆర్.పురం, శ్రీశైలం వంటి గిరిజన ప్రాంతాలకు ₹50 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
76 బర్త్ వెయిటింగ్ హాల్స్, 122 ఫీడర్ అంబులెన్సులు, అలాగే ₹482 కోట్లతో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
2.5 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు జరుగుతుండగా, గిరిజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొక 1 లక్ష ఎకరాల్లో సాగుకు అనుమతించారని తెలిపారు.
గిరిజన ప్రాంత అభివృద్ధికి ₹7500 కోట్లు, రోడ్ల నిర్మాణానికి ₹1300 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
గిరిజన దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ₹10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు సంతకం చేసినట్లు తెలిపారు.అరుకు, లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతాలకు పర్యాటక అభివృద్ధి కోసం ₹10 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపన చేసి కాలం వెళ్లబుచ్చిన గత ప్రభుత్వం వదిలేసిన ట్రైబల్ యూనివర్సిటీని మా కూటమి ప్రభుత్వం ప్రారంభించి, మా పాలనలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
విలువలు, రాజ్యాంగం, ఎన్నికలు సజావుగా జరుగుతాయని సైకో జగన్మోహన్ రెడ్డి చెబుతుండటం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు.
అదాని పవర్ ప్రాజెక్టును 2021లో వారి ప్రభుత్వం మంజూరు చేసిందని, కూటమి ప్రభుత్వం 2025 క్యాబినెట్ సమావేశంలో దాన్ని రద్దు చేసిందని తెలిపారు.
18 సంవత్సరాలు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మీరు నియోజకవర్గానికి ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మాది తిరుపతిరావు, మండల అధ్యక్షుడు పరమేశ్వసు, మక్కువ టి డి పి మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు, పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్, కేతిరెడ్డి చంద్ర, తదితరులు పాల్గొన్నారు. (Story:గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 7500 కోట్లు)

